తెలుగే బంగారమాయెనే 

Happy Independence Day! 
The Quint
BOL
Updated:
Share your Telugu Bol with us! 
|
(Photo:Lijumol Joseph/The Quint)
Share your Telugu Bol with us! 
ADVERTISEMENT

ఏమండీ గమ్మున రండి, కేబుల్ కారు వచ్చేసింది అన్న అరుపుకు ఉన్న పలంగా వెనక్కి చూసి, మొహామోహాలు చూసుకొన్నాం నేను నా శ్రీమతి. ఓ తెలుగు జంట, కొత్తగా పెళ్ళైనట్టుంది.

జున్గ్ఫ్రరావ్,స్విట్జర్లాండ్లో అదీనూ, ఐరోపా ఖండం లోకళ్లా ఎత్తైన ప్రదేశములో తెలుగు మాట వినిపించడం అపురూపం కదా.

యూరోపీయన్ మీడియా సంస్థలో నేను పనిచేస్తూ అడపాదడపా ఐరోపాలో దేశాలు తిరిగేటప్పుడు ఒకసారి పారిసులో, ఆ బ్రెడ్డుముక్కలు నేనింక తినలేను మొర్రో అని నా నోరు నాలిక మొత్తుకొంటేనూ, పోనీ ఒక పాలి ప్రయత్నిద్దాము అని బయలుదేరి రోడ్డుమీద ఒక శ్రీలంకీయుడుని అడిగితే, సర్వనాభవన్ ఉందనీ ఎలా వెళ్లాలో కూడా తెలుగులో చెప్పేడు. తెలుగువాడినని ఎలా తెలుసు, మీకు తెలుగు ఎలా వచ్చు అంటే, నీవు ఇందాకల ఫోనులో మాటాడింటివి కదా అని తెలుగులో, తమిళయాసలో చెప్పేడు, అతనికి పచారికొట్టు ఉందని, ఆతని దగ్గిరేకొచ్చే గ్రాహకులు ఎక్కువ తెలుగువారు ఆవడంచేత

మనోడు కొంచెం తెలుగు నేర్చుకొన్నాడుట.

ఇంతకూ ఈ సోది ఎందుకు రాస్తూన్నానంటే నా మాతృభాష తెనుంగు అదేనండీ తెలుగుని వినకపోయినా, చదవకపోయినా, తెలుగులో మాటామంతీ ఆడకపోయినా మనసు దిగాలుపడిపోతుంది. సంవత్సరాల క్రితం జేబులో మూడొందలు,నాలుగు జతలబట్టలు, కోట్లరూపాయల కన్నా మించిన ఆత్మస్థయిర్యం, మరియు నోట్లో తియ్యని తెలుగుభాషతో రాజధాని ఢిల్లీలో పొట్టకూటికోసం వచ్చిన మన తెలుగువాళ్లు జాబితాలో నా పేరు కూడా చివరినెక్కడో ఉంటుంది.ఢిల్లీ వచ్చిన కొత్తలో తెలుగు వినడం కరువైపోయేది, మాట్లాడాన్నికి వాచిపోయేవాడ్ని. ఎక్కడైనా అదృష్టవశాత్తు తెలుగు వినిపిస్తే

పోయిన ప్రాణం లేచొచ్చినట్లుoడేది. ఇప్పట్లాగ ఫోన్లో మీట నొక్కితే వార్తాపత్రికలు లభ్యమయ్యేవికావు. పత్రికలకోసం వారానికోసారి ఎ.పీ.భవనo వెళ్లడం కూడా గగనమే.

తెలుగు యొక్క పుట్టుక,ఆవిర్భావం,ద్రావిడబాషతో సారూప్యమున్నదా లేక సంస్ర్కుతంతో మూలమా అనే విషయాలులోకి వెల్లదల్చుకోలేదు. ఎంతో మంది పండితులు, మేధావులు, భాషాజ్ఞానులు వీటిమీద చాలా భిన్నాభిప్రాయలు వ్యక్తపరిచారు. నాకు అంత అర్హత లేదు కావున ఆ విషయాలు వాళ్లకి వదిలేసి, మన తెలుగు గొప్పదనం చెప్పుకొందాము.

తేనె+అగు = తెనుంగు. మన తెలుగు పలికితే తేనె లాగుంటుంది. “పంచదార కన్న పనస తొనల కన్న కమ్మని తేనె కన్న తెలుగు మిన్న” అని వెనకటికో కవి అన్నారు. నికోలో కొంటీ అనే ఇటాలియన్ సందర్శకుడు 15వ శతాబ్దంలొనే తెలుగుని ‘‘ఇటాలియన్ ఆఫ్ థ ఈస్ట్” గా అభివర్ణించారు. మరో నమ్మకం ప్రకారం తెలుగు అనే పదం త్రిలింగ(తెలుగు ప్రదేశంలోనున్న లింగాలు ద్రాక్షరామం లేదా భీమేశ్వరo,శ్రీశైలం, కాళేశ్వరము) నుంచి ఉద్భవించింది. ద్రావిడ భాష పుట్టుకనిచ్చిన 21 భాషలోకి మన తెనుగు ఒకటి. కొన్ని వాడుక,లిపి లేక అదృశ్యమైపోయాయ, మరికొన్ని కోయ బాషలగా ఉండిపోయాయి. ఆంధ్రరాష్ట్రము భౌతికంగా రెండు ముక్కలుగా విడిపోయినందుకు బాధపడినా తెలుగు భాష మాట్లాడేవాళ్ళందరూ

ఐకమత్యంగా ఉంటునందుకు పట్టరాని ఆనందగా ఉంది.

మన తెనుగు బాషకున్న ప్రత్యేకతలు బోలెడు. గమ్మత్తేమిటంటే మాట్లాడే యాస ప్రాంతీయవారీగా వేరైనా వ్యాకరణం, రాయడం, సాహిత్యం

దగ్గిర్కోచ్చేసరికి అంతా ఒక్కటే.

అందరూ పెట్టినట్టే 2013లో మా బంధువులుతో గూడిన వాట్సాప్ గ్రూప్ ఆరంభించాకా,తేలిన విషయం యేమంటే అందరూ తెంగ్లీష్ (ఆంగ్ల అక్షరాల్లో తెలుగు భావం)రాయడానికి మ్రోగ్గు చూపేవారు. పొరపాటున తెలుగులో ఒక టపా పెట్టినా, కొంతమందికి అర్థం అయ్యేదికాదు. అలాగే హిందీలో ఉంటే తతిమావాళ్లకు ఆ అక్షరాలుని కూడబలుక్కోడం కష్టమయ్యేది. ఈ విషయం పూర్వాపరల్లోకి అంటే 1960-80 లలోకి వెళ్ళాలి. అప్పట్లో చాలామంది తెలుగువాళ్లు రైల్వే, స్టీలుప్లాంట్లు, టాటా లాంటి సంస్థలలో, ఉద్యోగార్జన నిమిత్తం ఇతర రాష్టాలోకి, మెట్రో, మహానగరాల్లోకి వెళ్ళిపోయి స్థిరపడిపోయేవారు. అలాగే అమెరికా, కెనడా, సింగపూర్ లాంటి దేశాలకి వెళ్లి స్థిరపడిన తెలుగువాళ్లు కూడా కోకొల్లలు. కాకపోతే ఈ విధంగా తెలుగు భాష దేశం నలుదిశలా వ్యాప్తి చెందినది.

ప్రవాసాంధ్రుల పిల్లలకు ఇంట్లో వాడుక భాష తెలుగు కాబట్టి మాట్లాడం వచ్చినా,చదవడం, రాయడం రానివాళ్ళున్నారు. అది వాళ్ళ తప్పు ససేమిరా కాదు. దేశ,రాష్ట్ర,బాష, కాలమాన ప్రకారమో, పరిస్థితుల ప్రభావంవలనో, బడుల్లో హిందీలో లేక ప్రాంతీయభాష మాధ్యమాలలో బోధించడంవలనో తెలుగు నేర్చుకొనలేకపోయేవారు.

తెలుగు భాష 2001 జనాభాలెక్కల ప్రకారం దేశంలో హిందీ తర్వాత అత్యధికంగా మాట్లాడే బాషగా ఉండేది. కానీ 2011 జనాభాలెక్కలు మాత్రం దేశంలో హిందీ తర్వాత అత్యధికంగా మాట్లాడే బాష బెంగాలీ (బంగాళీయులకు అభినందనలు) అని నిరూపించేయి. తెలుగు మూడో స్థానం చిక్కించుకొంది.

ప్రపంచంలో అత్యధికంగా మాట్లాడే భాషల్లో తెలుగుది 15వ స్థానం. భారతదేశ జనాభాలో తెలుగువాళ్ళు దాదాపు 8 శాతం ఉండగా ప్రపంచ జనాభాలో 1 శాతం ఉన్నాము. అయినా మనకి ఈ ర్యాంకులుతో సంభంధం లేదుకానీ అందరూ తమ తమ మాతృభాషని పరిరక్షించుకోవడానికి కృషి చేయాలి.

మనలో మనమాట, శ్రీకృష్ణదేవరాయలు గారు తెలుగు భాష లెస్స అన్నారు కానీ ఇపుడు లెస్స కాస్త ఆంగ్లరూపం ధరించుకొని లెస్ ఆయినట్టుందండోయు.

నిజం నిగ్గు తేల్చాలంటె,1990-2000 సంవత్సరం తదుపరి పుట్టిన ప్రవాసాంధ్రుల పిల్లల్లో హెచ్చుమందికి మాతృభాషలో మాట్లాడడం కూడా క్లిష్టమే. అయ్యో పాపం వాళ్లని తప్పు పట్టలేము, ఇలా బడుల్లో చేర్చగానే అలా అంకెలు, ఎక్కాలు నేర్చుకొన్నారో లేదో ఎదో ఒలింపియాడ్ అని, ట్యూషన్లని పోటీ ప్రపంచములోకి నెట్టివేయబడుతున్నారు.

ఇంకెక్కడి తెలుగు అసలు సమయం, ఓపిక ఉంటే కదా, ఉన్నా ఎవరు నేర్పిస్తారు. తాతా,నానమ్మ,అమ్మమ్మ లేని కొంపలో టీ.వీ, మొబైల్ సాక్షిగా, ఆయమ్మ పరిరక్షణలో పెరుగుతున్నారు. అమ్మా, నాన్న ఇద్దరూ ఉద్యోగాలకెళ్లిపోతారు. దీనికితోడు ప్రపంచీకరణ పుణ్యమాని ఫ్రెంచ్, జర్మన్ అని అంతర్జాతీయ భాషలు కూడా పాఠశాలల్లో పిల్లలమీద రుద్దుతున్నారు. మాతృభాషకే దిక్కులేదు, ఇంకా ఈ భాషలు ఎదో మొక్కుబడుకి, నేర్చుకొన్నామనిపించుకోడానికి. ఈ రోజుల్లో పిల్లలకి తెలుగుతో బాటు ఏదోక బాషలో ప్రావీణ్యం, పట్టు ఉండేలా కోరుకొందాము.

ADVERTISEMENT
ADVERTISEMENT

మా అమ్మా, నాన్నగారు, మనవళ్ళుకి యధావిధిగా తెలుగు నేర్పించే ప్రయత్నాలు చేసేవారు, వాళ్ళున్నన్నాళ్ళు ఎదో నేర్చుకొని మాట్లాడేవారు, వాళ్లేల్లిపోయాక మళ్లీ మామూలే. కొంతమంది ప్రవాసాంధ్రులు ఇళ్లలో మనుమలు, అమ్మమ్మ/నాయనమ్మల మధ్య సైగలు చెడుకోడమే ఒక భాష. ఎందుచేతనంటే పిల్లలుకొచ్చిన భాష బామ్మగారికి రాదు, బామ్మగారి తెలుగు వాళ్ళకి పూర్తిగా అర్ధం అవ్వదు.

మొదట్లో నేను, పిల్లలికి తెలుగుని నేర్పించాలన్న విషయం పెద్దగా పట్టించుకోలేదు కానీ, కొన్ని సంఘటనలు నన్ను త్రట్టిలేపాయి.

భారతదేశంలో మొదట ఆంగ్లం, హిందీలలో ప్రసారం మొదలెట్టిన నేను పనిచేసే నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్, తెలుగు, ఇతర భాషలోని కూడా ప్రసారం చేయడానికి చేస్తున్న ప్రయత్నాలలో నేను కూడా భాగస్వామిని. నాగచైతన్యని తెలుగు ఛానల్ ఆరంభం తాలూకా ప్రకటనలకి ఎన్నుకొడానికి నాగార్జునగారితో సంప్రదింపులు జరిపేము.

అప్పుడు అనిపించింది నా పిల్లలు మను చరిత్రో, వసు చరిత్రో,

వెయిపడగలో చదవడానికి కావల్సిన తెలుగు నేర్చుకోలేకపోయినా పర్లేదు కానీ మాతృ భాషలో నాల్గు ముక్కలు రాయడం, నీతి పద్యాలు, కధలు చదవడం వస్తే అదే పదివేలు అని.

పొట్టి శ్రీరాములు గారు ప్రాణత్యాగం చేసి తెలుగు భాష ఆధారంగా, మద్రాస్ ప్రెసిడెన్సీ రాష్ట్రాన్ని సాధించేరు. మన తదుపరి తరాలకు తెలుగు

త్యాగమూర్తులు,గొప్ప వ్యక్తులు,సంఘసేవకులు, స్వాతంత్రోద్యమ నాయకులు అయిన టంగుటూరి ప్రకాశం పంతులుగారు, భోగరాజు పట్టాభి సీతారామయ్య, కందుకూరి వీరేశలింగం, అల్లూరి సీతారామరాజు తదితరులు నిస్వార్డముగా త్యాగానికి సిద్దపడ్డారు. అస్సొంటోళ్ల గురుంచి తెలియపరచాలి.

11వ శతాబ్ధం లో ఆదికవి నన్నయ్య నుంచి పెద్దన,పోతన,తిక్కన,శ్రీనాధుడు మొదలగులు ప్రాచీన తెలుగు సాహిత్యంకి ప్రాణం పోసేరు. 16వ శతాబ్ధం చివరికి

ఆంధ్రభోజుడు, శ్రీకృష్ణదేవరాయలు తెలుగు భాషని అభిమానించి, ఆదరించిన తరువాత, తెలుగు సాహిత్యం సరైన పోషణలేక ఇంచుమించు శిథిలావస్థకు చేరుకొంది. 1800లలో చార్లెస్ ఫిలిప్ బ్రౌన్, తెలుగువాళ్లు ఆత్మీయంగా పిలుచుకునే మన బ్రౌన్ దొర తెలుగు సాహిత్యంకి పునఃఊపిరి పోసేరు. ఎన్నో కావ్యాలని సరళమైన తెలుగు భాషలోకి రాయడమే కాకుండా ఆంగ్లం-తెలుగు నిఘంటువుని కూడా రూపొందించేరు.

తెలుగుతేజాలు ఎన్.టీ.రామారావుగారు, పీ.వీ నరసింహారావుగారు మన తెలుగు భాషకు తెచ్చిన గుర్తింపు వన్నోళ్ళ కొనియాడదగినది మరియ మరువలేనిది.

సాధ్యమైనంతవరకు తెలుగు భాషని తరతరాలకి అందిద్దాము, మన పిల్లలకి నేర్పిద్దాము, తెలుగువారితో తెలుగులొనే మాట్లాడుదాము.డిజిటల్ యుగంలో అందరికీ సాంకేతిక నైపుణ్యం ఉండకపోవచ్చు, లేఖిని నేర్చుకోలేకపోవచ్చు,బ్లాగులో తెలుగులో రాయడం రాకపోవచ్చుకానీ చదవడం, మాట్లాడం, కాగితంమీద రాయడం

నేర్చుకొందాము, మరియుపిల్లలకి నేర్పిద్దాము. ఆ లేఖిని సోఫ్ట్వేర్, బ్లాగ్ సాఫ్ట్వేర్ కోడింగ్ కూడా ఆంగ్లంలో రాసిందే. కావున అన్ని భాషలుని గౌరవిద్దాము. ప్రంపంచీకరణలో అన్ని భాషలు మీద ఆశక్తి, ప్రవేశం ఉండడం అన్నివిధాలా మంచిదే.

తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను తెలుగు వల్లభుండ తెలుగొకండ ఎల్లవారు వినగ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స

భారతీయులకు, ద క్విన్టు పాఠకులకు, ప్రత్యేకంగా తెలుగువారికి, 71వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.

సునీల్ ధవళ

(This article was sent to The Quint by Sunil Kumar Dhavala for our Independence Day campaign, BOL – Love your Bhasha. Sunil Dhavala is a Management Consultant & Startup specialist. He has also headed a senior leadership positions at world's most admired Media & Entertainment Companies.

Love your mother tongue? This Independence Day, tell The Quint why and how you love your bhasha. You may even win a BOL t-shirt! Sing, write, perform, spew poetry – whatever you like – in your mother tongue. Send us your BOL at bol@thequint.com or WhatsApp it to 9910181818.)

(At The Quint, we are answerable only to our audience. Play an active role in shaping our journalism by becoming a member. Because the truth is worth it.)

Published: 14 Aug 2017,05:20 PM IST

ADVERTISEMENT
SCROLL FOR NEXT