ADVERTISEMENTREMOVE AD

శ్రీదేవి... Sridevi’s Tollywood Story – In Telugu!

Sridevi conquered Tollywood before Bollywood. Read her story in Telugu, or listen to it in English.

Updated
Celebrities
3 min read
story-hero-img
i
Aa
Aa
Small
Aa
Medium
Aa
Large
Hindi Female

(This article is part of a series on Sridevi in Telugu and Tamil, written by bloggers and writers proficient in the language.)

You can listen to this story in English, right here!

ADVERTISEMENTREMOVE AD

నాలుగైదు తరాల తెలుగు, తమిళ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. బాల నటిగా, కథానాయికగా తిరుగులేని గుర్తింపు పొందిన తార. ఆ తరువాత పాన్ ఇండియా స్టార్‌ హోదాను ఎలాంటి పోటీ లేకుండా దక్కించుకున్న హీరోయిన్. అందుకే సిఎన్ఎన్, బిబిసి లాంటి విదేశీ వార్తా మాధ్యమాలు కూడా ఆమె ఆకస్మిక మరణం గురించి ప్రత్యేకంగా కథనాలు వెలువరించడంలో ఆశ్చర్యమేం లేదు. ఇక రెండు రోజులుగా ఆమె అభిమాన ప్రేక్షకులు గుండెలు చెదిరి విషాదంలో ఉన్నారు.

వినోద, వార్తా ప్రపంచాన్నీ, ప్రేక్షక లోకాన్నీ ఇంతగా ప్రభావితం చేసిన శ్రీదేవి ఎప్పుడూ గోడ చేర్పును కోరుకున్న బంగారు పళ్ళెం. తల్లి రాజేశ్వరి మరణించేవరకూ ఆమె మీద ఆధారపడిన శ్రీదేవికి చెల్లెలి తిరుగుబాటు ఒక పెద్ద షాక్. కుటుంబం లేని లోటు తీర్చే అండను బోనీకపూర్‌లో చూసుకుంది. తల్లి మరణం లాంటి షాక్ శ్రీదేవి బాగా అభిమానించే జయలలిత కూడా ఎదుర్కొన్నారు. అయితే పరిస్థితుల మీద ఆమె తిరగబడ్డారు. ఆ తిరుగుబాటు తత్వం ఏ దశలోనూ శ్రేదేవిలో కనిపించదు. అంతేకాదు, సినీ నటిగా తప్ప మరే విధంగానూ పబ్లిక్ ఎక్స్ పోజర్ ఆశించలేదో, లేదంటే ఏ పరిమితులైనా కట్టి పడేశాయో తెలీదు కానీ, తన సమకాలీన తారలు జయప్రద, జయసుధల్లా రాజకీయాలవైపు శ్రీదేవి కన్నెత్తి చూడలేదు. శ్రీదేవిలాగే దక్షిణాది నుంచి హిందీలోకి వెళ్ళి డ్రీమ్‌గర్ల్ గా వెలిగిన హేమమాలిని కూడా పెళ్ళైన వ్యక్తినే వివాహం చేసుకున్నారు. అయితే శ్రీదేవిలా పరిమితులు విధించుకోలేదు. రాజకీయాల్లోనూ రాణించారు. తలచుకుంటే రాజ్యసభ సభ్యత్వంలాంటివి శ్రీదేవికి చాలా సులభంగా వచ్చి ఉండేవి.

0
Sridevi conquered Tollywood before Bollywood. Read her story in Telugu, or listen to it in English.
Sridevi became Telugu cinema’s biggest star while still in her twenties. She acted with NTR, ANR and Krishna, the biggest stars of their time.
(Photo Courtesy: Right Click Telugu)
ADVERTISEMENTREMOVE AD

ప్రారంభం నుంచీ తన వయసుకు మించిన పరిణతిని ప్రదర్శించాల్సిన పాత్రల్ని శ్రీదేవి పోషించింది. హీరోయిన్‌గా మారిన తొలి రోజుల్లో ‘పదహారేళ్ళ వయసు’తో దక్షిణాదిని ఒక ఊపు ఊపేసిన తరువాత ‘కార్తీకదీపం’లో సినిమా తనకన్నా పద్ధెనిమిదేళ్ళు పెద్దదైన శారదతో శ్రీదేవి పోటీ పడి నటించింది. తరువాత వచ్చిన ‘వేటగాడు’ గ్లామర్ తారగా ఆమెను మరో కోణంలో ఆవిష్కరించింది. ‘ఇల్లాలు’, ‘పచ్చని కాపురం’ లాంటి సినిమాలు శ్రీదేవిలో అభినయానికి అద్దం పడితే, ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ లాంటి సూపర్ స్టార్స్ తో చేసిన మాస్ సినిమాలు ఆమెను తారాపథం వైపు నడిపించాయి. తమిళంలో ‘సిగప్పు రోజాకళ్’ (తెలుగులో ‘ఎర్రగులాబీలు’), ‘మూండ్రాం పిరై’ (తెలుగులో ‘వసంత కోకిల’) లాంటి ఎన్నో సినిమాల్లో ఆమె నటనకు నీరాజనాలు పట్టారు. ఇంట గెలిచిన శ్రీదేవి మొదట్లో హిందీలో నటించిన చాలా సినిమాలు దక్షిణాది చిత్రాల రీమేక్‌లే. హిందీ ప్రేక్షకులు ‘థండర్ థైస్’ అంటూ శ్రీదేవిని చూసి ముగ్ధులైపోయిన- హిందీలో ఆమె తొలి బ్లాక్ బస్టర్ ‘హిమ్మత్‌వాలా’ (1983) కూడా తెలుగు సినిమా ‘ఊరికి మొనగాడు’కు రీమేక్. అదే సంవత్సరం ‘సద్మా’గా ‘మూండ్రాం పిరై’ హిందీలోకి వచ్చింది. ఆ తరువాత శ్రీదేవి బాలీవుడ్‌లో ఎవరికీ అందని స్థాయికి చేరుకుంది. చిన్న వయసునుంచీ దక్షిణాది చిత్రాల్లో ఉన్న పునాది దీనికి బాగా ఉపయోగపడింది.

ADVERTISEMENTREMOVE AD
సౌత్‌లో, బాలీవుడ్‌లో ఎవరికీ అందనంత స్టార్‌డమ్ అనుభవించిన ఆమె మొదటి నుంచీ జీవితంతో రాజీ పడుతూ వచ్చింది. బడికి వెళ్లే వయసులో స్టూడియో ఫ్లోర్ల చుట్టూ తిరిగినా, తోటి పిల్లలతో ఆటపాటలకు అవకాశాలు లేకపోయినా- అలాంటివి కోల్పోయాననే అభిప్రాయాన్ని ఆమె ఎప్పుడూ వ్యక్తపరచలేదు.
ADVERTISEMENTREMOVE AD
Sridevi conquered Tollywood before Bollywood. Read her story in Telugu, or listen to it in English.
Sridevi in Vasantha Kokila, the Telugu remake of the iconic 16 Vayathinile.
(Photo Courtesy: Telugu Films)
ADVERTISEMENTREMOVE AD

శ్రీదేవి స్వతహాగా సిగ్గరి అంటారు ఆమెతో పరిచయం ఉన్నవాళ్ళు. అది నిజమో కాదో తెలీదు కానీ, తనకు తానుగా ఆమె కొన్ని పరిమితులు విధించుకుంది. వ్యక్తిగతంగా, కుటుంబపరంగా ఆమె గురించి ఎన్నో కథనాలు వచ్చాయి. తోటి బాలనటుడు, తరువాత సహ కథానాయకుడు కమల్‌హాసన్‌తో ఎఫైర్, హిందీ హీరో మిధున్ చక్రవర్తితో పెళ్ళి, తల్లి మరణం తరువాత ఆస్తి గొడవలు, బోనీ కపూర్‌తో రహస్య వివాహం, అతని మొదటి భార్య, పిల్లల్తో గొడవలు... దేని గురించీ ఆమె ఎక్కడా మాట్లాడలేదు. మీడియా వెంటాడినా స్పందించలేదు. ఆఖరికి ‘ఆమె మా నాన్నకి రెండో భార్య మాత్రమే’ అంటూ సవతి కొడుకు అర్జున్ కపూర్ ఈసడించినా, దాని గురించి నోరెత్తలేదు. నటిగా రీఎంట్రీ ఇచ్చిన తరువాత మాత్రమే ఆమె మీడియాకు ఆమె కాస్త దగ్గరగా వచ్చారు. భర్త, తన పిల్లల గురించి కొంచెం కొంచెంగా మాట్లాడ్డం మొదలుపెట్టారు. తన పెద్ద కూతురు జాన్వీ సినీ రంగ ప్రవేశానికి సంబంధించిన విషయాలే ఎక్కువ.

ADVERTISEMENTREMOVE AD
తన చుట్టూ ఒక ప్రపంచం నిర్మించుకొని, తనకు అవసరమైనప్పుడు మాత్రమే బయటికి వచ్చే మనస్తత్వం ఉన్న శ్రీదేవి- ఆమె జీవితంలో చివరి క్షణాల మీద రేకెత్తుతున్న ప్రశ్నలకూ, సందేహాలకూ కూడా సమాధానాలివ్వకుండానే వెళిపోయింది. ఒంటరిగా... ఓ మిస్టరీలా...
ADVERTISEMENTREMOVE AD

(Hey there, lady! What makes you laugh? Do you laugh at sexism, patriarchy, and misogyny? Do 'sanskaari' stereotypes crack you up? This Women's Day, join The Quint's Ab Laugh Naari campaign. Pick up that beer, say cheers, and send us photographs or videos of you laughing out loud at buriladki@thequint.com.)

(At The Quint, we are answerable only to our audience. Play an active role in shaping our journalism by becoming a member. Because the truth is worth it.)

Read Latest News and Breaking News at The Quint, browse for more from entertainment and celebrities

Topics:  Sridevi   Tollywood   RIP Sridevi 

Published: 
Speaking truth to power requires allies like you.
Become a Member
3 months
12 months
12 months
Check Member Benefits
Read More